సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన జెడ్+ భద్రతా వివరాలు, రక్త వర్గాన్ని ఎక్స్ (X) ఖాతాలో పోస్ట్ చేసిన వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
జూన్ 13న జరిగిన వైర్లెస్ లీక్ ద్వారా ముఖ్యమంత్రి భద్రతా వివరాలను బహిర్గతం చేశారని సీఎస్ఓ కె.బి. ఫ్రాంక్లిన్ ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 'తెలుగు స్క్రైబ్' ఖాతా నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.