ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ఇంకా జరుగుతుండగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది. తుది జాబితాలు రాకముందే ఎన్నికలు పెడితే ఓటర్ల హక్కులు హరించుకుపోయే ప్రమాదం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
ఓటర్ల తొలగింపుపై YSRCP భయాలు న్యాయబద్ధమేనని జస్టిస్ వి. సుజాత తెలిపారు. తుది జాబితాలు లేకుండా ఎన్నికలు నిర్వహించరాదని, SIR పూర్తికాకుండా నోటిఫికేషన్ ఇవ్వరాదని కోర్టు స్పష్టం చేసింది.